అంగన్వాడీలు పిల్లల భవిష్యత్తుకు పునాది: సంధ్యారాణి
AP: అంగన్వాడీ కేంద్రాలు పిల్లల భవిష్యత్తుకు పునాది వేసే ముఖ్యమైన కేంద్రాలని మంత్రి సంధ్యారాణి తెలిపారు. పార్వతీపురం మన్యం జిల్లా కలెక్టరేట్‌లో పోషణ్ పఖ్వాడా కార్యక్రమంలో ఆమె మాట్లాడుతూ.. 'ఏప్రిల్ 9 నుంచి 23 వరకు దేశవ్యాప్తంగా కార్యక్రమం నిర్వహిస్తాం. తల్లీబిడ్డల కోసం సరైన పోషకాహారం అందేలా చూడాలి. పోషణ్ పఖ్యాడాలో ప్రతి కుటుంబం భాగస్వామ్యం కావాలి' అని సూచించారు.