చందనోత్సవ ఏర్పాట్లపై కలెక్టర్ ఆకస్మిక తనిఖీ

చందనోత్సవ ఏర్పాట్లపై కలెక్టర్ ఆకస్మిక తనిఖీ

VSP: సింహాచలం చందనోత్సవ ఏర్పాట్లను జిల్లా కలెక్టర్ అభిషిక్త్ కిశోర్ స్వయంగా పరిశీలించారు. క్యూలైన్లలో భక్తులకు కల్పిస్తున్న సౌకర్యాల గురించి ఆయన నేరుగా భక్తులతో మాట్లాడి, ఇబ్బందులేమైనా ఉన్నాయా అని ఆరా తీశారు. అధికారుల ఏర్పాట్లపై భక్తులు సానుకూలంగా స్పందించడంతో కలెక్టర్ హర్షం వ్యక్తం చేశారు.