ఘోర ప్రమాదం.. చిన్నారి మృతి
NGKL: వెల్దండ మండల పరిధిలోని చెరుకూరు గేట్ సమీపంలో శ్రీశైలం-హైదరాబాద్ జాతీయ రహదారిపై శనివారం రాత్రి కారు-బైక్ ఢీకొన్నాయి. ఈ ప్రమాదంలో హైదరాబాద్ నుంచి స్వగ్రామానికి వస్తున్న వంగూర్ మండలం నర్సంపల్లి గ్రామానికి చెందిన సౌడంపల్లి సురేష్ కుమార్తె సౌడంపల్లి వరలక్ష్మి (10) అక్కడికక్కడే మృతి చెందింది. తండ్రి సౌడంపల్లి సురేశ్‌కు తీవ్ర గాయాలయ్యాయి.