భారీ చోరీ.. 117 సవర్ల బంగారం మాయం

భారీ చోరీ.. 117 సవర్ల బంగారం మాయం

GNTR: చీరాలలోని పువ్వాడ వారి వీధిలో మంగళవారం అర్థరాత్రి భారీ చోరీ జరిగింది. మంగళవారం సాయంత్రం ఇంటికి తాళం వేసి ఆస్పత్రికి వెళ్లి. తిరిగొచ్చేసరికి గదిలో కారం చల్లి ఉందని బాధితుడు మువ్వల ఆంజనేయులు తెలిపారు. అనుమానం వచ్చి ఇంట్లో చెక్ చేయగా. సెల్ఫ్‌లో ఉండాల్సిన 117 సవర్ల బంగారం, రూ.1.65 లక్షల నగదు చోరీకి గురైనట్టు 1వ పట్టణ పోలీసులకు ఫిర్యాదు చేశారు.