గుండెపోటుతో టీడీపీ సీనియర్ నేత మృతి

గుండెపోటుతో టీడీపీ సీనియర్ నేత మృతి

KMM: ఖమ్మం 5వ డివిజన్‌కు చెందిన TDP సీనియర్ నాయకులు కోయ శ్రీనివాసరావు శనివారం ఉదయం గుండెపోటుతో మృతి చెందారు. ఆ పార్టీ జిల్లా ప్రధాన కార్యదర్శి కేతినేని హరీష్ వారి పార్థివదేహాన్ని సందర్శించి పార్టీ జెండాకప్పి పూలమాల వేసి నివాళులర్పించారు. వారి కుటుంబ సభ్యులను పరామర్శించి ప్రగాఢ సానుభూతి వ్యక్తం చేశారు. శ్రీనివాసరావు మృతి పార్టీకి తీరని లోటన్నారు.