అంబేద్కర్ జయంతి వేడుకలకు ఏర్పాట్లు చేయాలి

MNCL: జిల్లా కేంద్రంలో ఏప్రిల్ 14న అంబేద్కర్ జయంతి వేడుకలు ఘనంగా నిర్వహించేందుకు ఏర్పాట్లు చేయాలని కోరుతూ శుక్రవారం ఐక్యవిద్యార్థి సంఘాల ఆధ్వర్యంలో మున్సిపల్ కమిషనర్‌కు వినతిపత్రం అందజేశారు. ఐక్యవిద్యార్థి సంఘాల నాయకులు చిప్పకుర్తి శ్రీనివాస్, చేరాల వంశీ మాట్లాడుతూ.. అంబేద్కర్ విగ్రహం వద్ద ఎలాంటి జెండాలు, బ్యానర్లు కట్టకుండా చర్యలు తీసుకోవాలన్నారు.