రోడ్డు ప్రమాదం.. యువకుడు మృతి

రోడ్డు ప్రమాదం.. యువకుడు మృతి

MDK: HYD శివారులోని ఔటర్ రింగ్ రోడ్డులో ఇవాళ రోడ్డు ప్రమాదం జరిగింది. ఈ ప్రమాదంలో మెదక్ పట్టణానికి చెందిన యువకుడు దుర్మరణం చెందాడు. వివరాల ప్రకారం.. పట్టణానికి చెందిన కాముని భారత్ ఇవాళ రింగ్ రోడ్డుపై కారులో వస్తుండగా టిప్పర్ ఢీకొట్టింది. ఈ ఘటనలో అతడు మరణించాడు. కాగా, కారులో ప్రయాణిస్తున్న మెదక్ కరూర్ వైశ్య బ్యాంకు మేనేజర్ భార్యకు తీవ్ర గాయాలవడంతో అసుపత్రికి తరలించారు.