VIDEO: కన్నుల పండుగగా తిమ్మప్ప స్వామి తెప్పోత్సవం
GDWL: మల్దకల్ శ్రీ స్వయంభు లక్ష్మీ వెంకటేశ్వర స్వామి బ్రహ్మోత్సవాల సందర్భంగా బుధవారం సాయంత్రం కోనేరులో స్వామివారి తెప్పోత్సవం అంగరంగ వైభవంగా జరిగింది. వందలాది భక్తులు ఈ దివ్య వేడుకను తిలకించారు. హంసవాహనంపై శ్రీదేవి–భూదేవి సమేత శ్రీనివాసుని తెప్పోత్సవాన్ని ఆలయ చైర్మన్ పట్వారి ప్రహ్లాద రావు, ఈఓ సత్యచంద్రారెడ్డి ఆధ్వర్యంలో నిర్వహించారు.