టీటీడీ శుభవార్త.. ఇకపై తిరుమలలో అక్షరాభ్యాసం

టీటీడీ శుభవార్త.. ఇకపై తిరుమలలో అక్షరాభ్యాసం

తిరుమల భక్తులకు టీటీడీ శుభవార్త చెప్పింది. ఇకపై తెలంగాణ బాసర ఆలయం తరహాలో తిరుమలలో కూడా అక్షరాభ్యాసం చేసేందుకు వీలు కల్పించింది. తొలుత పైలట్ ప్రాజెక్ట్‌గా శ్రీ వకుళమాత ఆలయంలో ఈ కార్యక్రమాన్ని ప్రారంభించాలని నిర్ణయించింది. 'గోవిందం' పేరుతో మూడు నుంచి ఐదేళ్ల వయసున్న చిన్నారులకు అక్షరాభ్యాసం చేయవచ్చు. ఇటీవల జరిగిన బోర్డు సమావేశంలో టీటీడీ ఈ నిర్ణయం తీసుకుంది.