'హోళీ సందర్భంగా సహజ రంగులు మాత్రమే వాడాలి'

'హోళీ సందర్భంగా సహజ రంగులు మాత్రమే వాడాలి'

WGL: హోళీ పండుగ సందర్భంగా సహజసిద్ధ రంగులను మాత్రమే వినియోగించాలని, రసాయనిక రంగులు వాడకూడదని వరంగల్ CP సన్‌ ప్రీత్ సింగ్ సూచించారు. ఇతరులకు ఇబ్బంది కలిగించేలా బలవంతంగా రంగులు చల్లడం, నీటి బెలూన్లు విసరడం వంటి చర్యలకు పాల్పడవద్దని హెచ్చరించారు. డ్రంక్ అండ్ డ్రైవ్ తనిఖీలు విస్తృతంగా నిర్వహిస్తామని, నిబంధనలు ఉల్లంఘిస్తే కఠిన చర్యలు తీసుకుంటామన్నారు.