ప్రారంభంకానున్న సోమశిల-శ్రీశైలం లాంచీ యాత్ర

ప్రారంభంకానున్న సోమశిల-శ్రీశైలం లాంచీ యాత్ర

NGKL: జిల్లా కొల్లాపూర్ తీరాన ఉన్న సోమశిల నుంచి శ్రీశైలం వరకు కృష్ణా నదిలో లాంచీ ప్రయాణ సేవలు ఈ నెల 15న ప్రారంభం కానున్నాయి. కృష్ణా నదికి వరద ప్రవాహం తగ్గి నీళ్లు నిలకడగా ఉండటంతో ప్రయాణానికి పర్యాటకశాఖ అధికారులు ఏర్పాట్లు చేస్తున్నారు. బుకింగ్ ఆధారంగా ఈ నెల 15 లేక 16న లాంచీ ప్రయాణం ప్రారంభమవుతుందని పర్యాటకశాఖ అధికారులు తెలిపారు.