జిల్లాలో 58 ఆశా కార్యకర్తల ఉద్యోగాలకు నోటిఫికేషన్

ATP: జిల్లా వైద్య ఆరోగ్యశాఖలో ఖాళీగా ఉన్న 58 ఆశా కార్యకర్తల పోస్టులకు అభ్యర్థుల నుంచి దరఖాస్తులు ఆహ్వానిస్తున్నామని డీఎంహెచ్ ఈబీ. దేవి తెలిపారు. ఈ నెల 25 నుంచి 30వ తేదీలోపు పోస్టుల కేటాయింపు ప్రక్రియకు సంబంధించి ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలలో గానీ, సచివాలయాలలో గానీ అభ్యర్థులు దరఖాస్తు చేసుకోవలసిందిగా సూచించారు.