ఎన్నికలు.. బీజేపీ మ్యానిఫెస్టో విడుదల

ఎన్నికలు.. బీజేపీ మ్యానిఫెస్టో విడుదల

అసోం అసెంబ్లీ ఎన్నికల నేపథ్యంలో బీజేపీ తన మ్యానిఫెస్టోను విడుదల చేసింది. మొత్తం 31 హామీలను సీఎం హిమంత బిశ్వ శర్మ ప్రకటించారు. ఇందులో భాగంగా మహిళలకు నెలకు రూ.3 వేలు అందిస్తామని హామీ ఇచ్చారు. అలాగే ఎస్టీ ప్రాంతాలు మినహా.. అసోం వ్యాప్తంగా యూసీసీని అమలు చేస్తామని చెప్పారు. కాగా, ఏప్రిల్ 9న రాష్ట్రంలోని 126 అసెంబ్లీ స్థానాలకు పోలింగ్ జరగనుంది. మే 4న ఫలితాలు రానున్నాయి.