మిరప పంటలో పురుగుల నివారణకు సూచనలు

మిరప పంటలో పురుగుల నివారణకు సూచనలు

MHBD: గంగారం మండల కేంద్రంలోని రైతులకు మండల వ్యవసాయ శాఖ అధికారి వేణు యాదవ్ సోమవారం మిరప పంటలో ఆకు ముడత, కాయల మచ్చల నివారణకు పలు సూచనలు చేశారు. రసం పీల్చే పురుగుల వల్ల ఆకులు ముడుచుకుపోతాయని, కాయల గీరడం వల్ల మచ్చలు ఏర్పడతాయన్నారు. నివారణకు లీటరు నీటిలో ప్రిఫోనిల్ 2 మి.లీ లేదా స్పైనోశాడ్ 3 మి.లీ కలిపి పిచికారీ చేయాలని ఆయన పేర్కొన్నారు.