సూరీడమ్మ కుటుంబానికి రూ.10 లక్షల చెక్కు అందజేత

సూరీడమ్మ కుటుంబానికి రూ.10 లక్షల చెక్కు అందజేత

SKLM: డయేరియాతో సూరీడమ్మ మరణించడం అత్యంత బాధాకరమని శ్రీకాకుళం ఎమ్మెల్యే శంకర్ అన్నారు. శనివారం రాత్రి ఆమె కుటుంబ సభ్యులను ఎమ్మెల్యే పరామర్శించారు. ప్రభుత్వం మంజూరు చేసిన రూ.10 లక్షల ఆర్థిక సహాయాన్ని వారి కుటుంబ సభ్యులకు అందజేశారు. ప్రభుత్వం తరఫున అండగా ఉంటామన్నారు. జిల్లా కలెక్టర్ స్వప్నిల్ దినకర్ ఉన్నారు.