చర్లపల్లిలో డబుల్.. వారికి గుబుల్..!

చర్లపల్లిలో డబుల్.. వారికి గుబుల్..!

MDCL: ఉప్పల్ అసెంబ్లీ పరిధి చర్లపల్లి డబుల్ బెడ్‌రూమ్ ఇండ్లలో అసలు లబ్ధిదారులు కాకుండా ఇతరులు నివసిస్తున్నట్లు అధికారులకు సమాచారం అందింది. దీనిపై త్వరలోనే తనిఖీలు నిర్వహించి తగిన చర్యలు తీసుకోనున్నారు. నివాసంలో లేని లబ్ధిదారులకు నోటీసులు జారీ చేయనున్నట్లు తెలిపారు. అద్దెకున్న వారిపై కూడా చర్యలు తీసుకునే అవకాశం ఉండడంతో వారికి గుబులు పట్టుకుంది.