ఇఫ్తార్ విందులో పాల్గొన్న స్పీకర్

VKB: పట్టణంలోని చిగుళ్లపల్లి గ్రౌండ్లో ఏర్పాటు చేసిన ఇఫ్తార్ విందులో తెలంగాణ రాష్ట్ర శాసన సభాపతి, వికారాబాద్ శాసనసభ్యులు గడ్డం ప్రసాద్ కుమార్ పాల్గొన్నారు. రంజాన్ ఉపవాస దీక్ష సందర్భంగా మహబూబ్ అలీఖాన్ నవాబ్ ఈ విందును ఏర్పాటు చేశారు. స్పీకర్ ముందుగా ప్రార్థనలో పాల్గొని, అనంతరం ముస్లిం సోదరులకు ఖర్జూర తినిపించి ఉపవాస దీక్షను విరమింపజేశారు.