రెండు కార్లు ఢీ.. నలుగురికి గాయాలు

రెండు కార్లు ఢీ.. నలుగురికి గాయాలు

ములుగు: జిల్లా కేంద్రం సమీపంలోని ఎర్ర గట్టమ్మ సమీపంలో ఈ రోజు ఉదయం రోడ్డు ప్రమాదం జరిగింది. 163 జాతీయ రహదారిపై ఎదురెదురుగా వస్తున్న రెండు కార్లు ఢీకొన్నాయి. ఈ ప్రమాదంలో నలుగురికి తీవ్ర గాయాలయ్యాయి. వెంటనే స్థానికులు వారిని చికిత్స నిమిత్తం వరంగల్ ఎంజీఎం ఆసుపత్రికి తరలించారు.