16 నుంచి పార్లమెంట్‌ ప్రత్యేక సమావేశాలు

16 నుంచి పార్లమెంట్‌ ప్రత్యేక సమావేశాలు

పార్లమెంట్‌ సమావేశాలు స్వల్ప విరామం తర్వాత ఈనెల 16 నుంచి తిరిగి ప్రారంభం కానున్నాయి. ఉభయ సభలు వరుసగా 3 రోజులపాటు ప్రత్యేకంగా జరుగుతాయని ప్రభుత్వ వర్గాలు వెల్లడించాయి. మహిళా రిజర్వేషన్ల చట్టాన్ని త్వరగా అమలు చేయడంతోపాటు లోక్‌సభ స్థానాల సంఖ్యను 543 నుంచి 816కు పెంపు, రాష్ట్రాల్లో అసెంబ్లీ స్థానాలను పెంచడానికి ఉద్దేశించిన బిల్లులను ఈ సమావేశాల్లో ఆమోదించనున్నారు.