మరికొన్ని గంటల్లో జిల్లాలో వర్షాలు

మరికొన్ని గంటల్లో జిల్లాలో వర్షాలు

ప్రకాశం: జిల్లాలో రానున్న కొన్ని గంటల్లో వర్షాలు పడే అవకాశం ఉన్నట్లు వాతవరణ శాఖ అధికారులు వెల్లడించారు. ఈ నేపథ్యంలో జిల్లా ప్రజలు జాగ్రత్తగా ఉండాలని సూచించారు. ముఖ్యంగా పొలాల వద్దకు వెళ్లే  రైతులు తగిన జాగ్రత్తలు తీసుకోవాలన్నారు. ఉరుములు, మెరుపులతో కూడిన పిడుగులు పడే అవకాశం ఉన్నందున పొలాల్లో లేదా చెట్ల కింద ఉండకుండా సురక్షిత ప్రాంతాలకు వెళ్లాలని సూచించారు.