VIDEO: ఇచ్చాపురంలో కార్డెన్ సెర్చ్.. 14 వాహనాలు స్వాధీనం

VIDEO: ఇచ్చాపురంలో కార్డెన్ సెర్చ్.. 14 వాహనాలు స్వాధీనం

SKLM: ఇచ్చాపురం రూరల్ మండలం ఎం తర్రులో కార్డెన్ సెర్చ్ చేపట్టామని ఎస్సై శ్రీనివాస్ తెలిపారు. సోమవారం ఉదయం చేపట్టిన ఈ తనిఖీలలో భాగంగా అపరిచిత వ్యక్తులు తారసపడితే తక్షణమే పోలీసులకు సమాచారం అందించాలని పేర్కొన్నారు. ఈ తనిఖీలలో భాగంగా ఎటువంటి పత్రాలు లేని 14 ద్విచక్ర వాహనాలను స్వాధీనం చేసుకున్నామని వివరించారు. పూర్తి పత్రాలతో తమను సంప్రదించాలన్నారు.