బాధిత కుటుంబానికి ఆర్థిక సహాయం
AKP: అనారోగ్యంతో మృతి చెందిన హోంగార్డు డీ.వీ. వెంకటరావు కుటుంబానికి అనకాపల్లి పోలీసులు అండగా నిలిచారు. విశాఖ స్టీల్ ప్లాంట్‌లో విధులు నిర్వర్తిస్తూ మృతి చెందిన వెంకట్రావు కుటుంబానికి రూ.4,24,120 చెక్కును బుధవారం ఎస్పీ తుహీన్ సిన్హా అందజేశారు. అనకాపల్లి, అల్లూరు జిల్లాలకు చెందిన హోంగార్డులు ఒకరోజు డ్యూటీ అలవెన్స్ విరాళంగా అందజేశారు.