ఉగ్ర దాడిని ఖండిస్తూ నిరసన ర్యాలీ

PPM: జమ్మూ కాశ్మీర్లో పహాల్గంలో జరిగినటు వంటి ఉగ్ర దాడిని ఖండిస్తూ స్ఫూర్తి మహిళా మండలి డైరెక్టర్ బలగరాధ ఆధ్వర్యంలో సాలూరు మెయిన్ రోడ్డు యూనియన్ బ్యాంక్ దగ్గర నుండి బోసు బొమ్మ జంక్షన్ వరకు మహిళా మండలి సభ్యులతో నిరసన ర్యాలీ చేపట్టారు. పర్యాటకుల పై ఉగ్రదాడి జరపడం దుర్మార్గమైన చర్య అన్నారు. ఈ కార్యక్రమంలో మహిళా మండలి లీడర్ సుగుణ పాల్గొన్నారు.