తిరుగులేని ఆధిపత్యాన్ని సాధించాం: ట్రంప్

తిరుగులేని ఆధిపత్యాన్ని సాధించాం: ట్రంప్

యుద్ధ విమానం 'F-15E' కూలిపోయిన ఘటనలో గల్లంతైన రెండో పైలట్‌ను అమెరికా దళాలు రక్షించాయని ట్రంప్ ప్రకటించారు. దేశ చరిత్రలోనే అత్యంత సాహసోపేతమైన ఆపరేషన్‌ను తమ సైన్యం విజయవంతంగా పూర్తి చేసిందన్నారు. శత్రు భూభాగంలోకి వెళ్లి ఎయిర్‌మెన్ రక్షించడం అమెరికా చరిత్రలో ఇదే మొదటిసారని తెలిపారు. ఇరాన్ గగనతలంపై తిరుగులేని ఆధిపత్యాన్ని సాధించామనడానికి ఇదే నిదర్శనమన్నారు.