రైలు ఢీకొని వ్యక్తి మృతి
KRNL: కోసిగి రైల్వే స్టేషన్ సమీపంలో రైలు ఢీకొని ఆదివారం గుర్తుతెలియని వ్యక్తి మృతి చెందాడు. బెంగళూరు నుంచి బీదర్ వెళ్లే రైలు ఢీకొని మృతి చెందినట్లు స్థానికులు పోలీసులకు సమాచారం ఇచ్చారు. రైల్వే పోలీసులు ఘటనా స్థలాన్ని పరిశీలించారు. మృతుడి వయసు 40 ఉంటుందని, గుర్తుపట్టలేని స్థితిలో ఉన్నట్లు తెలిపారు. పూర్తి వివరాలు తెలియాల్సి ఉందన్నారు.