VIDEO: ఉచిత క్యాన్సర్ శిబిరం ప్రారంభం
కృష్ణా: పామర్రు (M) కొమరవోలు గ్రామంలో ఉచిత క్యాన్సర్ శిబిరాన్ని జిల్లా టీడీపీ అధ్యక్షుడు గురుమూర్తితో కలిసి ఎమ్మెల్యే వర్ల కుమార్ రాజా గురువారం ప్రారంభించారు. ఎమ్మెల్యే మాట్లాడుతూ.. గ్రామీణ ప్రాంతాల్లో క్యాన్సర్ వంటి వ్యాధులను ముందస్తుగా గుర్తించడం ఎంతో కీలకమని తెలిపారు. ఉచిత స్క్రీనింగ్ శిబిరాల ద్వారా ప్రారంభ దశలోనే వ్యాధిని గుర్తించవచ్చన్నారు.