నారాయణపేట నియోజకవర్గ బీఎస్పీ అధ్యక్షులుగా అశోక్
నారాయణపేట నియోజకవర్గం బీఎస్పీ పార్టీ అధ్యక్షులుగా మరికల్ మండలం ఇబ్రహీంపట్నం గ్రామానికి చెందిన దాసరి అశోక్ నియమించినట్లు జిల్లా అధ్యక్షుడు బొదిగలి శ్రీనివాస్ తెలిపారు. ఈ సందర్భంగా అశోక్ మాట్లాడుతూ నియోజకవర్గంలో బీఎస్పీ పార్టీ బలోపేతానికి కృషి చేస్తానని తెలిపారు. తనను నియమించిన జిల్లా అధ్యక్షులకు ధన్యవాదలు తెలిపారు.