బంగ్లాలో ఫిబ్రవరి 12న సార్వత్రిక ఎన్నికలు

బంగ్లాలో ఫిబ్రవరి 12న సార్వత్రిక ఎన్నికలు

వచ్చే ఏడాది ఫిబ్రవరి 12న బంగ్లాదేశ్ సార్వత్రిక ఎన్నికలను నిర్వహించనున్నట్లు ఆ దేశ ఎన్నికల సంఘం ప్రకటించింది. ఈ నెల 29 నుంచి నామినేషన్ల ప్రక్రియ మొదలవుతుందని తెలిపింది. జనవరి 22 నుంచి ఫిబ్రవరి 10వ తేదీ వరకు ఎన్నికల ప్రచారానికి అవకాశం ఉంటుందని చెప్పింది. ఫిబ్రవరి 12న దేశవ్యాప్తంగా 300 పార్లమెంటరీ స్థానాలకు ఒకే విడతలో ఎన్నికలు జరుగుతాయని వెల్లడించింది.