పీలేరు ఆసుపత్రిలో సిబ్బంది సమస్యలపై విచారణ
అన్నమయ్య: పీలేరు ప్రాంతీయ వైద్యశాలలో పారిశుద్ధ్య, సెక్యూరిటీ సిబ్బందితో అభివృద్ధి కమిటీ సభ్యులు సమావేశమై సమస్యలను తెలుసుకున్నారు. పై అధికారుల నుంచి ఎలాంటి ఇబ్బందులు లేవని సిబ్బంది తెలిపారు. అయితే రాత్రివేళ మద్యం సేవించి వచ్చే వ్యక్తుల వల్ల ఇబ్బందులు ఎదురవుతున్నాయని, అదనపు భద్రత లేదా పోలీసుల సహాయం కల్పించాలని కోరారు.