నేడు విద్యుత్ సరఫరాలో అంతరాయం
HNK: పట్టణంలోని గోపాల్పూర్ సబ్ స్టేషన్ పరిధిలో మరమ్మత్తుల కారణంగా ఇవాళ ఉదయం 9 గంటల నుంచి మధ్యాహ్నం 11 గంటల వరకు విద్యుత్ సరఫరా నిలిపివేయనున్నట్లు HNK టౌన్ DE సాంబరెడ్డి తెలిపారు. పనులు పూర్తయిన వెంటనే సరఫరా పునరుద్ధరించబడుతుందని ఆయన స్పష్టం చేశారు. వినియోగదారులు ఈ విషయాన్ని గమనించి సహకరించాలని కోరారు.