ఏసీబీ అధికారులు దాడి

పశ్చిమ గోదావరి: నరసాపురం టౌన్ స్టేషన్ లో సోమవారం ఏసీబీ దాడులు నిర్వహించారు. ఓ కేసులో నిందితులను తప్పించేందుకు ఎస్సై ప్రసాద్, రైటర్ నాగేశ్వరరావులు రూ.25 వేలు లంచం డిమాండ్ చేశారని వచ్చిన ఆరోపణలపై దాడులు నిర్వహించినట్లు ఏసీబీ అధికారులు తెలిపారు. ఎస్సై జీపు డ్రైవర్ నగదు తీసుకుంటుండగా పట్టుకున్నట్లు ఏలూరు డీఎస్పీ శ్రీహరి రాజు తెలిపారు.