VIDEO: పారా లీగల్ వాలంటీర్లకు ఇంటర్వ్యూలు
AKP: నర్సీపట్నం న్యాయస్థానం ఆవరణలో శుక్రవారం పారా లీగల్ వాలంటీర్స్ కోసం ఇంటర్వ్యూలు నిర్వహించారు. సీనియర్ సివిల్ జడ్జి పీ. షియాజ్ ఖాన్ ఆధ్వర్యంలో నిర్వహించిన ఇంటర్వ్యూలకు సుమారు పాతికమంది హాజరయ్యారు. జిల్లా లీగల్ సర్వీసెస్ అధారిటీ కార్యదర్శి ఇచ్చిన సూచన మేరకు నిర్వహించిన ఇంటర్వ్యూలలో న్యాయవాది మెట్టా ప్రభాకర్ పాల్గొన్నారు.