'చేప పిల్లల పంపిణీకి ర్యూట్ మ్యాప్‌తో సిద్ధంగా ఉన్నాం'
SRPT: రాష్ట్ర మత్స్యశాఖ మంత్రి వాకిటి శ్రీహరి ఉచిత చేప పిల్లల పంపిణీ కార్యక్రమంపై హైదరాబాద్ నుంచి అన్ని జిల్లాల కలెక్టర్లు, మత్స్యశాఖ అధికారులతో వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. ఈ కాన్ఫరెన్స్‌లో పాల్గొన్న జిల్లా కలెక్టర్ తేజస్ నందలాల్ చేప పిల్లల పంపిణీకి రూట్ మ్యాప్‌తో సహా సిద్దంగా ఉన్నట్లు పేర్కొన్నారు. అదనపు కలెక్టర్ సీతారామారావు తదితర అధికారులు పాల్గొన్నారు.