ఘనంగా సీపీ బ్రౌన్ జయంతి వేడుకులు
అన్నమయ్య: తెలుగు భాషా సేవలతో ప్రసిద్ధి పొందిన చార్లెస్ ఫిలిప్ బ్రౌన్ (సీపీ బ్రౌన్) జయంతి వేడుకలను జిల్లా పోలీసులు సోమవారం ఘనంగా నిర్వహించారు. జిల్లా ఎస్పీ ధీరజ్ ఆదేశాల మేరకు అదనపు ఎస్పీ వెంకటాద్రి చిత్రపటానికి పూలమాల వేసి వారి సేవలను స్మరిస్తూ ప్రసంగించారు. 1798లో కలకత్తలో జన్మించిన బ్రౌన్ కడపలో డిప్యూటీ కలెక్టరుగా పని చేశారన్నారు.