బద్వేల్ సీఐకు సేవా పతకం

KDP: బద్వేల్ రూరల్ సీఐ నాగభూషణానికి ఏపీ స్టేట్ పోలీస్ సేవా పతకం వచ్చింది. ఈ సందర్భంగా సీఐ మాట్లాడుతూ.. విధి నిర్వహణలో అంకితభావంతో పనిచేసినందుకు ప్రభుత్వం తన సేవలను గుర్తించిందన్నారు. తనను ఈ పతకానికి ఎంపిక చేయడం సంతోషంగా ఉందని చెప్పారు. అనంతరం ఎస్పీ అశోక్ కుమార్, సహచర పోలీస్ సిబ్బందికి ఆయన ధన్య వాదాలు తెలిపారు.