ఆరోపణలు నిరూపించాలి: జేసీ ప్రభాకర్ రెడ్డి
ATP: ఎర్ర కాలువ రోడ్డు స్థలంపై మాజీ ఎమ్మెల్యే పెద్దారెడ్డి చేసిన ఆరోపణలను నిరూపించాలని జేసీ ప్రభాకర్ రెడ్డి డిమాండ్ చేశారు. కాలువ వద్ద స్థలం ప్రైవేట్ నుంచి తీసుకొని రోడ్డు ఏర్పాటు చేశామన్నారు. ప్లాట్లు అక్రమంగా ఏర్పాటు చేశారని నిరూపిస్తే పడగొట్టడానికి సిద్ధంగా ఉన్నానని, లేదంటే తమ కౌన్సిలర్లు పెద్దారెడ్డి తండ్రి విగ్రహం వద్ద బైఠాయిస్తారని తెలిపారు.