KGBV పాఠశాలను సందర్శించిన సివిల్ జడ్జి
VZM: బాలికలపై జరుగుతున్న అఘయిత్యాలను ఎదుర్కొనేందుకు స్వీయ రక్షణ తీసుకోవాలని కొత్తవలస జూనియర్ సివిల్ జడ్జి డా. ఎస్. విజయ్ చందర్ అన్నారు. శనివారం అడ్డూరువానిపాలెం వద్ద ఉన్న కేజీబివి పాఠశాలను సందర్శించారు. ముందుగా పాఠశాలను పరిశీలించి, అక్కడ బాలికలతో మాట్లాడారు. ఆనంతరం మధ్యాహ్న భోజనాన్ని పరిశీలించి, ఆహార నాణ్యతపై విద్యార్థులను అడిగితెలుసుకున్నారు.