VIDEO: వైభవంగా ఆరట్టు మహోత్సవం
NRML: సోన్ మండలం కడ్తాల్‌లోని ధర్మశాస్త్ర అయ్యప్ప ఆలయంలో ఆదివారం అయ్యప్ప ఆరట్టు మహోత్సవాన్ని వైభవంగా నిర్వహించారు. ఆలయంలో అయ్యప్ప స్వాములు భక్తిశ్రద్ధలతో పూజలు నిర్వహించారు. అనంతరం ఆరట్టు మహోత్సవాన్ని ప్రారంభించారు. అయ్యప్ప నామస్మరణలతో గ్రామ పరిసరాలు మారుమ్రోగాయి. అనంతరం సోన్ గోదావరిలో అభిషేకం నిర్వహించారు.