జిల్లాలో వినాయక చవితితో.. మార్కెట్లు ఫుల్ రష్

KDP: వినాయక చవితికి ఒక్కరోజే మిగిలి ఉండడంతో మార్కెట్లలో రద్దీ భారీగా పెరిగింది. వినాయక ప్రతిమలు కొనేందుకు ప్రజలు విక్రయాల షెడ్ల వద్దకు భారీగా చేరుకుంటున్నారు. వ్యాపారులతో బేరమాడి ఐడల్స్ కొంటున్నారు. పూజకు అవసరమైన పత్రీలు, వస్తువులు, పూలు, పండ్లకు విపరీతమైన డిమాండ్ ఏర్పడింది. సామాగ్రి కొనుగోలుదారులతో కిరాణా, సూపర్ మార్కెట్లు కితకితలాడుతున్నాయి.