విక్రమ సింహపురి యూనివర్సిటీలో భారతీయ జ్ఞాన వ్యవస్థపై చర్చ కార్యక్రమం

NLR: వెంకటాచలం మండలంలోని విక్రమ సింహపురి యూనివర్సిటీలో మంగళవారం భారతీయ జ్ఞాన వ్యవస్థపై ప్యానాల్ చర్చా కార్యక్రమాన్ని నిర్వహించారు. కార్యక్రమానికి విసి శ్రీనివాసరావు ముఖ్య అతిథిగా విచ్చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ఉపనిషత్తులు, భారతీయ జ్ఞాన వ్యవస్థ వేదాలు, ఆయుర్వేదం, గణితం, ఖగోళ శాస్త్రం వంటివి శాస్త్రాల సమాహారమని తెలియజేశారు.