గ్లోబల్ సమ్మిట్ అతిథులకు కరీంనగర్ జ్ఞాపికలు
KNR: ఈనెల 8, 9 తేదీల్లో తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం నిర్వహించనున్న గ్లోబల్ సమ్మిట్లో పాల్గొనే వివిధ రాష్ట్రాల సీఎంలు, ప్రత్యేక అతిథులకు కరీంనగర్ సిల్వర్ ఫిలిగ్రీ సొసైటీ ఫిలిగ్రీ కళ (వెండి తీగ నగిషీ పని)తో రూపొందించిన బుద్ధుని జ్ఞాపికలను బహూకరించనున్నారు. సొసైటీకి 100 వరకు జ్ఞాపికల తయారీకి అవకాశం వచ్చింది. వీటి తయారీలో ఫిలిగ్రీ కళాకారులు నిమగ్నమయ్యరు.