గుడ్ న్యూస్.. నరసాపురం నుంచి వందే భారత్ రైలు

పశ్చిమగోదావరి జిల్లా వాసులు ఎంతో కాలంగా ఎదురు చూస్తున్న వందే భారత్ రైలు త్వరలో జిల్లాలో పరుగులు తీయనుంది. దీనికి సంబంధించి నరసాపురం రైల్వే స్టేషన్ లో పనులు శరవేగంగా సాగుతున్నాయి. రైల్వే బోర్డు నుంచి అనుమతి వచ్చిన వెంటనే నరసాపురం-చెన్నై మధ్య వందే భారత్ రైలు పట్టాలెక్కని ఉందని రైల్వే అధికారులు వెల్లడించారు. వచ్చేనెల నుంచి ఈ రైలు రాకపోకలు సాగించనుంది.