అభివృద్ధి పనులు వేగంగా పూర్తి చేయాలి: కలెక్టర్

అభివృద్ధి పనులు వేగంగా పూర్తి చేయాలి: కలెక్టర్

జగిత్యాల జిల్లాలో పంచాయతీరాజ్, ఉపాధి హామీ పథకం కింద కొనసాగుతున్న అభివృద్ధి పనులను త్వరితగతిన పూర్తి చేయాలని జిల్లా కలెక్టర్ సత్యప్రసాద్ ఆదేశించారు. బుధవారం సమీకృత కార్యాలయాల సమావేశ మందిరంలో ఈఈలు, ఎంపీడీవోలతో సమీక్ష నిర్వహించారు. పంచాయతీ భవనాలు, అంగన్వాడీ కేంద్రాలు, కిచెన్ షెడ్లు, పాఠశాల టాయిలెట్స్ నిర్మాణాల పురోగతిని పరిశీలించారు.