మేడారం జాతర ట్రాఫిక్‌పై వరంగల్ సీపీ పర్యవేక్షణ
MLG: మేడారం సమ్మక్క–సారలమ్మ జాతర ప్రారంభమైన నేపథ్యంలో వరంగల్ నగరం నుంచి మేడారం గద్దల వరకు వాహనాల రాకపోకలను బుధవారం పోలీస్ కమిషనర్ సన్‌ప్రీత్ సింగ్ పస్రా క్షేత్రస్థాయిలో పరిశీలించారు. తాడ్వాయి, జంక్షన్ ప్రాంతాల్లో ట్రాఫిక్ పరిస్థితిని పర్యవేక్షిస్తూ, సెక్టార్ అధికారులకు పలు సూచనలు చేశారు. ట్రాఫిక్‌ను సజావుగా నిర్వహించాలని ఆదేశించారు.