అమరావతి బిల్లు చారిత్రాత్మకం: కేంద్ర మంత్రి
SKLM: అమరావతి బిల్లు ఒక చారిత్రాత్మకం అని కేంద్ర మంత్రి రామ్మోహన్ నాయుడు అన్నారు.ఏపీ రాజధానిగా అమరావతికి పూర్తి చట్టబద్ధత కల్పించే బిల్లుకు లోక్‌సభ ఆమోదం తెలపడం పట్ల కేంద్ర మంత్రి ఆనందం వ్యక్తం చేశారు. ఈ బిల్లు రాజధాని విషయంలో ఉన్న సందిగ్ధతను తొలగించి రాష్ట్ర భవిష్యత్తుకు బలమైన పునాది వేస్తుందని ఆయన బుధవారం ప్రకటనలో పేర్కొన్నారు.