చోడవరంలో జనసేన సభ్యత్వాల నమోదుపై ప్రచారం
E.G: నల్లజర్ల మండలం చోడవరం గ్రామంలో జనసేన పార్టీ ఉద్యమి సభ్యత్వాలు నమోదుపై గురువారం ప్రచార వాహనాన్ని సిద్ధం చేశారు. ఈ కార్యక్రమంలో గోపాలపురం నియోజకవర్గ జనసేన పార్టీ ఇంఛార్జ్ దొడ్డిగర్ల సువర్ణరాజు హాజరై మాట్లాడారు. జనసేన సభ్యత్వం నమోదు ద్వారా ప్రమాదవశాత్తు ఏమన్నా జరిగితే ఆ కుటుంబానికి ఆసరాగా రూ.5 లక్షలు పవన్ కళ్యాణ్ బీమా సదుపాయం కల్పించారన్నారు.