1800 విమాన సర్వీసులు రద్దు
USలో విమాన సర్వీసులు తగ్గనున్నాయి. ప్రభుత్వ షట్‌డౌన్ కారణంగా రద్దీ అత్యధికంగా ఉన్న 40 విమానాశ్రయాల్లో రేపటి నుంచి 10% విమానాలను రద్దు చేయనుంది. పరిమిత సంఖ్యలో ఉన్న ఎయిర్ ట్రాఫిక్ కంట్రోలర్లపై ఒత్తిడి తగ్గించడానికి ఈ నిర్ణయం తీసుకుంది. దీంతో 1800 విమాన సర్వీసులు రద్దు కానున్నాయి. పరిస్థితి మరింత దిగజారితే అదనపు ఆంక్షలు విధిస్తామని అధికారులు చెప్పారు.