పేకాట శిబిరంపై పోలీసులు దాడి
ELR: ముసునూరు మండలం బలివేలో పేకాట శిబిరంపై మంగళవారం దాడి చేసినట్లు ఎస్సై చిరంజీవి తెలిపారు. ఈ దాడులలో 8 మంది పేకాటరాయుళ్లను అదుపులోకి తీసుకుని వారి వద్ద నుండి 13,500 నగదు, 52 పేక ముక్కలు సీజ్ చేసినట్లు చెప్పారు. పట్టుబడిన వ్యక్తులపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టామన్నారు. అసాంఘిక కార్యకలాపాలు నిర్వహిస్తే కఠిన చర్యలు తప్పవన్నారు.