గురుకుల పాఠశాలను సందర్శించిన అదనపు కలెక్టర్

HNK: ఆత్మకూరు మండలం పెద్దాపురం గ్రామంలోని మహాత్మ జ్యోతిరావు పూలే వెనుకబడిన తరగతుల సంక్షేమ బాలికల గురుకుల పాఠశాలను జిల్లా అదనపు కలెక్టర్ వెంకటరెడ్డి నేడు ఆకస్మికంగా సందర్శించారు. గురుకుల పాఠశాల రికార్డులతో పాటు వంటశాలను పరిశీలించి సిబ్బందికి పలు సూచనలు చేశారు.