మిట్టపాలెం నారాయణస్వామి ఆలయంలో ప్రత్యేక పూజ

మిట్టపాలెం నారాయణస్వామి ఆలయంలో ప్రత్యేక పూజ

ప్రకాశం: చంద్రశేఖరపురం మండలంలోని మిట్టపాలెం గ్రామంలో కలిసి ఉన్న ప్రముఖ పుణ్యక్షేత్రమైన మిట్టపాలెం నారాయణస్వామి ఆలయంలో ఆదివారం భక్తులు ప్రత్యేక పూజలు చేశారు. స్వామివారికి ఆదివారం ప్రీతికరమైన రోజు కావడంతో చుట్టుపక్కల గ్రామాల నుంచి భక్తులు ఆలయానికి చేరుకొని స్వామివారికి పొంగళ్ళు నైవేద్యంగా పెట్టి తమ మొక్కులను తీర్చుకున్నారు. ఆలయ ఈవో భక్తులకు వసతులు సమకూర్చారు.